క వి
నా మనసులో తలపు
లేమి పుట్టిన గాని
ఎలుగెత్తి లోకాని
కెల్లడిస్తాను
కవి గారి మాట కెదు
రేవరాడ గలరు
కవిరాజు కలము పో
టేవరాప గలరు
కవిగారి మాట మేల్
కతనాల మూట
కవిరాజు మాట దే
ఉని జేరు బాట
__________________________________________________________________________________
__________________________________________________________________________________
పాట
ఏదో ఒక ఆలోచన
నా మెదడులో కెళ్ళి
నానా విధముల నన్ను
బాధిస్తుంది
ఆలోచన భారం తో
ఈ లేత నా మనసు
ఏమి చేయలేక
లోలోన ఆ ఏడుపు
లీన మవుతుంది
పైకి పొరలిన ఏడుపు
పాటవుతుంది
__________________________________________________________________________________
పాట-తీట
పెద్దలు చిన్నలు ప్రజలలందరికి
బోధ పాడేదే పాట
అర్ధం కానీ అతుకు సమాసాల్
పద్యం మన కోక తీట
విశాలమైన హృదయం నుంచి
వీచిందైతే పాట
యశస్సు కోసం ప్రాకులాడుతూ
అల్ల్లినధైతే తీట
అనుభవముల తానందరి కొరకై
పాడిన దైతే పాట
ధన సంపాదన కొరకై వ్రాసిన
మనకందరికది తీట
ఉన్నది కన్నది వ్రాసినప్పుడే
ఉన్నత మౌనుర పాట
ఎన్నడు ఎరుగని అలంకారములు
ఎందుకురన్న తీట
చదివేటప్పుడు హృదయం పొంగగ
చేసింధైతే పాట
రణ రణ మ్రోగే డోలు దెబ్బలకు
దండం బాబు తీట
సుళువుగ తెలిసే చిన్న పదాలతో
పాడిన్ధైతే పాట
సంధి సమాసాల్ , సౌంస్కృత పదముల్
ఎందుకురన్న తీట
చదవంగానే హృదయం లోకి
జొర బడితేనే పాట
పైకి క్రిందకు పీకులడినా
బోధ పదనిదే తీట
దయ్యది ఎరా పాట
పేరు ప్రతిష్టకు పెనుగులాడిన
ప్రభంధ రచనలే తీట
![]() |
| యోగి వేమన |
__________________________________________________________________________________
జండా
జండా
స్వతంత్ర భారత జండా ఇది మన
స్వతంత్ర భారత జండా
ప్రపంచ శాంతి కి అండ ఈ మన
స్వతంత్ర భారత జండా
అన్ని జాతుల ఐక్యము కొరకు
అందరి ప్రజల ఆనందం కొరకు
అహింస సూత్రమ్ ఆధారం గా
ఆహర్నిసము పోరాటము సలిపే
11 స్వ 11
ముద్దులు కొలిపే మూడు రంగులు
మధ్యన చక్రం మానవ హృదయం
పెద్దా-చిన్నా: కొద్ది-గొప్ప
భేదాలను తొలగించే జండా
11 స్వ 11
హిందూ ముస్లిం క్రీస్టియన్ ఆంగ్లో
ఇండియనులకు దాస్యము బాపి
కోయకోదుల కొండ జాతుల
కళ్యాణము సమకూర్చే జండా
11 స్వ 11
ఎండా వాన ఎరుగకుండా
కండలు కరిగే కష్టం చేసి
తిండి లేక తిరుగు బీదల
కన్డై వర్ధిల్లు జండా
11 స్వ 11
ఎత్తు ఎత్తునా ఎగరనియ్యి
ఎల్లకాలం పూజ చెయ్యి
ప్రాణమైన ధారబోయి
జయ పతాకామునకు 11 స్వ 11
__________________________________________________________________________________
ఎవరు నీవు
మామిడి పిందెల వెనకను దాగి
నోరూరిస్తున్నావు
కోమటి గొంతుక లోపల దూరి
నవ్విస్తున్నావు
నిగ నిగ లాడే చిగురుల నుండి
నిక్కి చూస్తున్నావు
భగ భగ లాడే మంటలు రేపి
భయమును పుట్టిస్తున్నావు
పాడి ఆవుల పొదుగులోన
పాలై కూర్చున్నావు
కన్నులు మెరిసే ఒలిశ పూలను
కళ కళ లాడిస్తావు
కత్తి దెబ్బలకు కందిన చెట్టుకు
నెత్తురు చిలికిస్తావు
ఎవరోయి నీవు! ఎదుటకు రావోయి !
నా ఏదుటకు రావోయి
__________________________________________________________________________________
తెలుగు బిడ్డా !
తెలుగు బిడ్డా ! లేచి నిలువ వేమోయి
లోకాన చోటోకటి నీకున్నదోయి !
నీ పలుకులో నమృత చిలుకున్న దోయి
నీ హృదయమున మండు నిప్పున్నదోయి !
వీచు గాలికి ఎదురు నిలువవేమోయి
ధాటిగా నీ ప్రతిభ చాటవేమోయి !
తెలుగు బిడ్డా లేచి నిలువ వేమోయి
లోకాన చోటోకటి నీకున్నదోయి !
__________________________________________________________________________________
పెనసలు
పోతుంటే దారిలోన
పెనసలు దొరికింది
పేపరు మీద పెడితే
పద్యం వ్రాసింది
మెయిలు మీద నా పద్యం
మదరా సేళ్లిOది
పేరుబడ్డ పత్రికలో
ప్రకటిత మయింది
నలుగురు చదివారు
ఆనందించారు
నా పెనసలు మాటొక్కరికి
తలపుకు రాలేదు
__________________________________________________________________________________
ఎవరు నీవు
మామిడి పిందెల వెనకను దాగి
నోరూరిస్తున్నావు
కోమటి గొంతుక లోపల దూరి
నవ్విస్తున్నావు
నిగ నిగ లాడే చిగురుల నుండి
నిక్కి చూస్తున్నావు
భగ భగ లాడే మంటలు రేపి
భయమును పుట్టిస్తున్నావు
పాడి ఆవుల పొదుగులోన
పాలై కూర్చున్నావు
కన్నులు మెరిసే ఒలిశ పూలను
కళ కళ లాడిస్తావు
కత్తి దెబ్బలకు కందిన చెట్టుకు
నెత్తురు చిలికిస్తావు
ఎవరోయి నీవు! ఎదుటకు రావోయి !
నా ఏదుటకు రావోయి
__________________________________________________________________________________
అటు - ఇటు
అటు తిరిగితే బరువు అటు నవ్వితే రవ్వ
ఇటు ఒరిగితే బరువు ఇటు నవ్వితే రట్టు
బరువు మోసిన పడవ నవ్వులన్ని అడవి
తిరగబడుతుంది పువ్వులైనాయి
అటు తిరిగితే సొద అటు నడువగా సంఘ
ఇటు తిరిగితే రోద మిటు నడువగా దొంగ
సోదలోన నా మనసు తటపటలతో బ్రతుకు
రోద జెందుతుంది దాటి పోతుంది
అటు చూచితే గాధ అటు చూచితే ధర్మ
ఇటు చూచితే బాధ మిటు చూచితే కర్మ
బాధలకు మొదలేదో చేయవలసిన దేదో
బోధపదకుంది చెప్పు వారెవరు ....?
అటు పలికితే కులుకు అటు పాడితే గొడవ
ఇటు పలికితే ములుకు ఇటు పాడితే భడవ
ముళ్ళ పొదలకు నీరు పాటలన్నీ మూగి
జల్లువారెవరో ... మాటలైనాయి
అటు ఇటు మిళిత మై
ఒకటిగా మారితే
ఆనందముగ మనుషు
లందరుంటారు
__________________________________________________________________________________