దేవుడు
ఉన్నాడో ? లేడో
దేవు డున్నాడో? లేడో
నీవు - ఊహింప నేలరా ?
ఉన్న మూన్నాళ్లిచట
తిన్నగా బతకాలిరా
ఉన్నాడంటూ కొందరు
లెడు లేడని కొందరు
తన్నుకుంటూ బ్రతుకు
తగలేసుకుంటారు
ఉన్నాడంటే చూపమంటే చాలు
లేడంటే కారణ మదేటంటే నే చాలు
ఉన్నాడు లేడనేటి
ఉభయులు గప్చిప్ అండీ
ఉన్నాడంటూ శాసి
స్తున్నాడంటూ- మనదే
మున్నాదంటూ- ఇచట
అన్నిటికి అతడే
ఆధారమని- చేత
నున్నశక్తి కాస్త
సున్న చేసుకొనేల
కనదగినవేన్నో మన కన్నుల కగపడుతున్నై
వినదగినవేన్నో మన వీనుల కినబడుతున్నై
తినదగిన వెన్నో మన దాపున కనబడుతున్నై
కని, విని, తిని, హాయిగాను
మనలేక, సుఖము గనలేక
పనిలేని వాదనలతో
పాడైపోవంగ నేల
దేవుడు ---
ఉన్నాడో !లేడో !కాని
ఉన్నారు-మానవులు
ఉన్నారు-తల్ల్లి తండ్రు
లున్నారు -ఆలుబిడ్డ
లున్నారు - అన్నదమ్ము
లున్నవారినేల్ల వదలి
మన్ను బొమ్మ కోలువనేల
దేవుడు ---
ఉన్నాడో? లేడో ? కాని
ఉన్నాయి వృక్ష జాతు
లున్నాయి పక్షి జాతు
లున్నాయి ;నదులు పారు
తున్నాయి ;పంటభూము
లున్నాయి ;పూలు పూయు
చున్నాయి ---
కన్నుల కరువు దీర
కాంచీ సుఖమందలేక
ఉన్నది ఆకాశము - ఎదు
టున్నది అమ్భుధి చూస్తూ
ఉన్నాయ్ తారలు , ప్రవహి
స్తున్నది పున్నమి వెన్నెల
ఇన్ని గాంచి సంతోషపు
తన్మయత్వ మందలేక
అందమైన దీజగము
సుందరులీ మానవులు
అందరమూ కలసి -హయిగ
ఉన్దాంనుకొని మనవలె