Tuesday, 10 May 2011

ఆశ -
ఆశ పుట్టింది
చిగురు పెట్టింది
పూలు పూసింది
పిందేలేసింది

పండు పండే రోజులొస్తాయి
హాయి గుండె రోజులొస్తాయి

ఆశతో నా దిగులు
మాసి పోయింది
ఆశ తో నాక మా
వాశ్య పోయింది

ఆశ పండే రోజులొస్తాయి
హాయిగుండే రోజులొస్తాయి
__________________________________________________________________________________

నా హృదయం

గబా గబా జీవిత కాలం
గడచు చున్నది
జీవిత కర్తవ్యమేదో
తోచకున్నది

ఊహలంతు లేకుండా
ఊరుతున్నాయి
అది కావా లిదికావా
లంటున్నయ్యి

గందరగోళంగా ఉన్నవి నా
యందలి భావాలు
అందులోన మంచి చెడ్డ
ముందు యేరాలి.




మేఘం

ఎవరో !
తరుముకొస్తున్నట్లు
పరుగెత్తుతుంది

వెనకాల -
తళుకు తళుకున కత్తి
తెగ మెరుస్తుంది .

భోరున భోరున తాను
బొబ్బ పెడుతుంది
ఆకాశ మంతా
గగ్గోలు పెడుతుంది

బోట బోట మని కన్నీటి
బోట్లోదులుతుంది
తనకున్న బాధేంటో
తెలుపలేకుంది .
అల్లర్లు -



ఎందుకీ గోలుమాలు,మన
మందరం సోదరులం
ఎవరో పెట్టిందీ భేదం
నీరు పోసేది స్వలాభం
మానిపోతేనే ఈ రోగం
మనకందరికీ సౌభాగ్యం 11 ఎందుకీ 11

అగ్గిపుల్ల కొట్టిన దొర
బగ్గీలో పారిపోయే
సిగ్గుపడ్డ ఘోష స్త్రీ
చిక్కిందా మంటలోన 11 ఎందుకీ 11

దోచుకు పోయిన దొంగలు
దొరల్లాగ తిరుగుతారు
కాపలావాడు దొరికే
కానిస్టేబులు దెబ్బకు 11 ఎందుకీ 11

అమాయకుల ధన నష్టం
మన సరఫరాలకు కష్టం
ప్రయోజనం లేనిది స్పష్టం
ఎందుకీ పని ముదరష్టం 11 ఎందుకీ 11

మనమందరం భారతీయులం
అందరిధర్మం హిందూ ధర్మం
శాంతి అహింసలు మూల మర్మం
కలసి మెలసి ఉందాం !ఉందాం ! 11 ఎందుకీ 11

మన తాతలనాటిది సహనం
మనమేక్కింది శాంతి వాహనం
ఈ ద్వేషాలవ్వాలి నాశనం
కలసి మెలసి ఉండటం శాసనం 11 ఎందుకీ 11

స్వేఛ్చ

తోటనిండా పూలున్నై
వాసనలు వేదజల్లుతున్నై
మేడనిండా లైటులున్నై
కాంతులు ప్రసరించుతున్నై

సోదరా !నీకెన్ని ఉన్నా
స్వేఛ్చ లేదోయి !

గుమ్మములో మోటారులున్నై
కూర్చోటానికి సీటులున్నై
పెట్టెనిండా నోటులున్నై
పట్టుకోను చేతులున్నై

సోదరా !నీకెన్ని ఉన్నా
స్వేఛ్చ లేదోయి !

బుర్ర నిండా తలపులున్నై
నోటినిండా మాటలున్నై

సోదరా !నీకెన్ని ఉన్నా
స్వేఛ్చ లేదోయి !

స్వేఛ్చ లోనే జీవాముందోయి
స్వేఛ్చ లోనే భావాముందోయి

స్వేఛ్చ కోసం దేహమైన
ధారపోయలోయి !


జాకీ

"జాకీ'! అంటే చెంగున ఎగిరి
చేతులు అందిస్తుంది
ఛీ! ఫో ! అంటే చప్పున దిగి, నా
చే తులు నాకు తుంది


ఎక్కడికైనా వెళదామంటే
వెనకాలే వస్తుంది
గసురులు గసిరి కొట్టబోతే
కాళ్ళ కు చుట్టుకుంటుంది


తింటూ తింటూ పెట్టకపోతే
తోకాడిస్తుంది
ఎక్కడికైనా వెళ్ళిపోతే
దిక్కులు చూస్తుంటుంది


జాతి కుక్క 'జాకి'! దానికి
నీతి ఎంతొ ఉంది
నీతి లేని మనుషులు ,జాకీ
జాతి కంటే తక్కువ
__________________________________________________________________________________

రస్తాలు-

నీ తాహత పెంచాలనుకొంటే
దర్జా గా బ్రతకాలని ఉంటె
అన్న్యాయలెన్నో చెయ్యాలి
గొంతులు పర పర కొయ్యాలి


మేడలు కట్టించాలనుకొంటే
మోటారు ఎక్కలనుకొంటే
పూరిండ్లనలు పడగొట్టాలి
నిరుపేదల చెడగోట్టాలి


పెట్టెలలో డబ్బున్డాలంటే
ప్రజ నీ కొదిగుండాలని ఉంటె
దానం ధర్మం మానాలి
డాబులు లావుగా కొట్టాలి


మానవుడను 'నే' ననుకొంటే
జీవనమే ముఖ్య మనుకొంటే
ప్రేమిస్తూ పోతుండాలి
సేవిస్తూ జీవించాలి


_________________


ఆ డబ్బు -





అబ్బబ్బే ! ఆడబ్బా ?
నాకెందుకు దేవుడా

చేమ టూడ్చే చాకిరియ్యి
కష్టానికి ఫలితమియ్యి

నా కూలి డబ్బుల్ని
నాకు దొరకనియ్యి

చుట్టూ నలుగురికీ
కష్టం లేకుండాను

ఆనందంగానన్ను 
అనుభవించనియ్యి

అబ్బెబ్బే ! ఆ డబ్బా ?
నా కెందుకు దేముడా !

అధికారం

నే మోసిన ఇటికల భారం
నే కోసిన కర్రల సారం
నే వేసిన సున్నపు కారం
ఈ మేడ   కేవరిదధికరాం
             చూస్తున్నారా ! ఈ ఘోరం

నే వేసిన మట్టిది సారం
నే కట్టిన కట్ట ప్రవాహం
నే నాటిన మొక్కల ఫారం
ఈ పంట కేవరిదధికారం
              చూస్తున్నారా ! ఈ ఘోరం

నే నేరిన పాత్తికి బేరం
నే తీసి చుట్టిన దారం
నే నేసినదే పవిత్రం
ఈ బట్టకేవరిదధికారం
               చూస్తున్నారా ! ఈ ఘోరం

మా అందరిదా ఈ కష్టం
మీ కొందరిదా అదృష్టం
ఎన్నాళ్ళింకా ఈ ముదరష్టం
ఈ దేశం కేవరి దధికారం
                చూస్తున్నారా! ఈ ఘోరం

___________________________________________________________________________________