Sunday, 8 May 2011
మనిషి
![]() |
| సర్వే జనా సుఖినో భవంతు |
మరియా దుంటేనే , నే
మనిషంటానోయి !
ఒరియవాడైనా నా
సరి తెలుగు వాడైనా
పరమ నీచుని నేను
పశువేనంటానోయ్
ఇనుప పెట్టెల నిండా
ధనమెంత కలిగున్న
ఆకాశ మంతేత్తు
అంతస్తు మేడలున్న
నిజము చెప్పని వాడు
నిర్భాగ్యుడోయ్ !
పెద్ద చదువులు చదివి
పాసైన వాడైనా
శ్రద్ధగా తీర్ధాలన్నీ
సేవించిన వాడైనా
మంచి చెడ్డలు ఆలో
చించనివాడు మనిషే కాడోయ్
మరియా దుంటేనే నే
మనిషంటానోయి
విప్లవము

దరిద్రాన్ని మేం భరించ లేమిక
దరిద్రాన్ని మేం సహించ లేమిక
సుఖ జీవనమున కందరకు ఇట
సమాన హక్కుంది .
కారం ఉప్పు కలిపి తెనేసి
నీరు పొట్టకు నింపుతూ ఉంటె
కళ్ళు మంటలు ,కాళ్ళు పీకులు
వళ్ళు గడ గడ వణుకుతు ఉంటె
పిల్ల కడుపుకు పాలు పట్టవు
తల్లి కి మజ్జిగ నీరు దొరకదు
కేవు కేవు మని పిల్ల లరిస్తే
కడుపు తరుక్కుని పోతుంది .
తడుస్తూ ఎండుతూ ఎన్నాళ్ళింకా
గుడిసెలలో మేముండ గలం
ఎల్లా పిల్లలు బడికి పోవగా
బల్ల , పుల్లా లివ్వగలం
భరించ రాని దరిద్రమేంటి
భారత దేశం లో ,
రాముడంటు , దేముడంటు
నీమంగా బ్రతికే జాతికి
Subscribe to:
Posts (Atom)


