Saturday, 14 May 2011

mundu mata


కీ11  శే11 పులిపాక  సూర్య ప్రకాశ రావు గారు
  
ముందు మాట : 

కీ.శే. పులిపాక సూర్యప్రకాశ  రావు గారు నా తండ్రి గారు. మా  స్వస్థలం గుంటూరు లోని మన్నవ గ్రామం. వీరి జననం  1914 లో ఒక పేద కుటుంబంలోను,  కాలేజి విద్యాభ్యాసం  గుంటూరులోను, విజయనగరం లో జరిపారు. కాశి లో1939లొ న్యాయ శాస్త్రం లో హిందూ విశ్వవిద్యాలయం లో డిగ్రీ పొందారు . తదుపరి జయపూర్ (ఒరిస్సా ) వచ్చి న్యాయ వాదిగా స్థిరపడిపోయారు . ఆది వాసులకు తదితర నిరు పేదలకు జరిగే అన్యాయాలను తన వ్రుత్తి ధర్మంగా ఎదిరించే వారు . అదే విషయ వస్తువు తో కొన్ని రచనలు కూడా చేసారు.

హై స్కూల్ విద్యార్ధి గానే కవితలు వ్రాయడం ప్రారంభించారు .ఈ' కాసులపేరు' లోని కొన్ని పాటలు వారు 1930-1960 మధ్య కాలం లో వ్రాసినవి . ఇవి కాక గురజాడ శతజయంతి కానుకగా ముత్యాలసరాలు పేరుతొ పద్యాలూ హోమియో  పతి వైద్యం లో వారి అనుభవాలు ఆధ్యాత్మిక ప్రసంగాలు , భజన పాటలు ,నవలలు , వ్యాసాలు కధలు అనేకం వ్రాసారు. 

అనారోగ్య కారణంగా 1967 లో వృత్తి కి స్వస్తి చెప్పి ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటూ 1985 లో కన్ను మూసారు.

ఈ కాసులపేరు ను నా బ్లాగ్ లో ప్రచురించి అందరికి ఈ పాటలు వినిపించాలన్నది నా మొదటి ప్రయత్నం

Friday, 13 May 2011



నడచి పోయేది ఒక క్రొత్త బాట

చేర బోయేది ఆనంద మేట

పేజి పేజి కి ఒక మంచి పాట

జీవితాదార్శమే  !సుకవి మాట

Thursday, 12 May 2011

పూ జ

విత్తు నాటి ,నీరు పోసి
మొక్క పెంచాడు
పెంచి పెద్ద దాని నిట తా
నుంచి పోయాడు

పూయమన్నాడు ,కాయలు
కాయమన్నాడు
కాయలన్నీ కాసి లోకం
కీయ మన్నాడు

ధన్యాత్మ నా తండ్రి
దాటి పోయాడు
తనకున్న పని చేసి
దివి కి చేరాడు


__________________________________________________________________________________
కీ 11 శే 11 గిడుగు రామ మూర్తి  గారు 
                                           
గురు పూజ

గిడుగు రామ మూర్తి
అతడొక
పిడుగులాంటి వ్యక్తీ
జడుపు గిడుపు లేకుండా
వైరుల
గడ గడ లాడించిన మహనీయుడు

పరుగున భావములోచ్చి
వాటికి పదములు దొరకక చచ్చి
పైకి క్రిందకు పీకులడుచు
భావములన్ని పాడు చేసుకోను
ఆధునిక కుర్రాళ్ళందరి పాలిటి
అవతార మూర్తి

మానవ హృదయం మంచి క్షేత్రమని
భావాలందున నాటాలని
పూచిన పూవుల వాసనలన్నీ
ప్రపంచమంతా వీచాలని
ప్రజలందరికి పంచాలని
కోరి జీవితం ధారబోసిన

__________________________________________________________________________________

Wednesday, 11 May 2011


క వి


నా మనసులో తలపు
లేమి పుట్టిన గాని
ఎలుగెత్తి లోకాని
కెల్లడిస్తాను

కవి గారి మాట కెదు
రేవరాడ గలరు
కవిరాజు కలము పో
టేవరాప గలరు

కవిగారి మాట మేల్
కతనాల మూట
కవిరాజు మాట దే
ఉని జేరు బాట


__________________________________________________________________________________


పాట


ఏదో ఒక ఆలోచన
నా మెదడులో కెళ్ళి
నానా విధముల నన్ను
బాధిస్తుంది

ఆలోచన భారం తో
ఈ లేత నా మనసు
ఏమి చేయలేక
ఏడుస్తుంది

లోలోన ఆ ఏడుపు
లీన మవుతుంది
పైకి పొరలిన ఏడుపు
పాటవుతుంది
__________________________________________________________________________________

పాట-తీట


పెద్దలు చిన్నలు ప్రజలలందరికి
బోధ పాడేదే పాట
అర్ధం కానీ అతుకు సమాసాల్
పద్యం మన కోక తీట

విశాలమైన హృదయం నుంచి
వీచిందైతే పాట
యశస్సు కోసం ప్రాకులాడుతూ
అల్ల్లినధైతే తీట

అనుభవముల తానందరి కొరకై
పాడిన దైతే పాట
ధన సంపాదన కొరకై వ్రాసిన
మనకందరికది తీట

ఉన్నది కన్నది వ్రాసినప్పుడే
ఉన్నత మౌనుర పాట
ఎన్నడు ఎరుగని అలంకారములు
ఎందుకురన్న తీట

చదివేటప్పుడు హృదయం పొంగగ
చేసింధైతే పాట
రణ రణ మ్రోగే డోలు దెబ్బలకు
దండం బాబు తీట

సుళువుగ తెలిసే చిన్న పదాలతో
పాడిన్ధైతే పాట
సంధి సమాసాల్ , సౌంస్కృత పదముల్
ఎందుకురన్న తీట

చదవంగానే హృదయం లోకి
జొర బడితేనే పాట
పైకి క్రిందకు పీకులడినా
బోధ పదనిదే తీట

తీయని పలుకుల వేమన పాడిన
దయ్యది ఎరా పాట
పేరు ప్రతిష్టకు పెనుగులాడిన
ప్రభంధ రచనలే తీట
యోగి వేమన

__________________________________________________________________________________

జండా

స్వతంత్ర భారత జండా ఇది మన
స్వతంత్ర భారత జండా
ప్రపంచ శాంతి కి అండ ఈ మన
స్వతంత్ర భారత జండా

అన్ని జాతుల ఐక్యము కొరకు
అందరి ప్రజల ఆనందం కొరకు
అహింస సూత్రమ్ ఆధారం గా
ఆహర్నిసము పోరాటము సలిపే
11 స్వ 11
ముద్దులు కొలిపే మూడు రంగులు
మధ్యన చక్రం మానవ హృదయం
పెద్దా-చిన్నా: కొద్ది-గొప్ప
భేదాలను తొలగించే జండా
11 స్వ 11
హిందూ ముస్లిం క్రీస్టియన్ ఆంగ్లో
ఇండియనులకు దాస్యము బాపి
కోయకోదుల కొండ జాతుల
కళ్యాణము సమకూర్చే జండా
11 స్వ 11
ఎండా వాన ఎరుగకుండా
కండలు కరిగే కష్టం చేసి
తిండి లేక తిరుగు బీదల
కన్డై వర్ధిల్లు జండా
11 స్వ 11
ఎత్తు ఎత్తునా ఎగరనియ్యి
ఎల్లకాలం పూజ చెయ్యి
ప్రాణమైన ధారబోయి

జయ పతాకామునకు 11 స్వ 11
__________________________________________________________________________________


తెలుగు బిడ్డా !

తెలుగు బిడ్డా ! లేచి నిలువ వేమోయి
లోకాన చోటోకటి నీకున్నదోయి !

నీ పలుకులో నమృత చిలుకున్న దోయి
నీ హృదయమున మండు నిప్పున్నదోయి !

వీచు గాలికి ఎదురు నిలువవేమోయి
ధాటిగా నీ ప్రతిభ చాటవేమోయి !

తెలుగు బిడ్డా లేచి నిలువ వేమోయి
లోకాన చోటోకటి నీకున్నదోయి !

__________________________________________________________________________________


పెనసలు



పోతుంటే దారిలోన
పెనసలు దొరికింది
పేపరు మీద పెడితే
పద్యం వ్రాసింది


మెయిలు మీద నా పద్యం
మదరా సేళ్లిOది
పేరుబడ్డ పత్రికలో
ప్రకటిత మయింది


నలుగురు చదివారు
ఆనందించారు
నా పెనసలు మాటొక్కరికి
తలపుకు రాలేదు

__________________________________________________________________________________

ఎవరు నీవు

మామిడి పిందెల వెనకను దాగి
నోరూరిస్తున్నావు


కోమటి గొంతుక లోపల దూరి
నవ్విస్తున్నావు


నిగ నిగ లాడే చిగురుల నుండి
నిక్కి చూస్తున్నావు


భగ భగ లాడే మంటలు రేపి
భయమును పుట్టిస్తున్నావు


పాడి ఆవుల పొదుగులోన
పాలై కూర్చున్నావు


కన్నులు మెరిసే ఒలిశ పూలను
కళ కళ లాడిస్తావు


కత్తి దెబ్బలకు కందిన చెట్టుకు
నెత్తురు చిలికిస్తావు


ఎవరోయి నీవు! ఎదుటకు రావోయి !
నా ఏదుటకు రావోయి


__________________________________________________________________________________


అటు - ఇటు


అటు తిరిగితే బరువు                                                                                    అటు నవ్వితే రవ్వ
ఇటు ఒరిగితే బరువు                                                                                    ఇటు నవ్వితే రట్టు
బరువు మోసిన పడవ                                                                                  నవ్వులన్ని అడవి
తిరగబడుతుంది                                                                                           పువ్వులైనాయి

అటు తిరిగితే సొద                                                                                         అటు నడువగా సంఘ
ఇటు తిరిగితే రోద                                                                                         మిటు నడువగా దొంగ
సోదలోన నా మనసు                                                                                   తటపటలతో బ్రతుకు
రోద జెందుతుంది                                                                                         దాటి పోతుంది

అటు చూచితే గాధ                                                                                       అటు చూచితే ధర్మ
ఇటు చూచితే బాధ                                                                                      మిటు చూచితే కర్మ
బాధలకు మొదలేదో                                                                                    చేయవలసిన దేదో
బోధపదకుంది                                                                                             చెప్పు వారెవరు ....?

అటు పలికితే కులుకు                                                                                 అటు పాడితే గొడవ
ఇటు పలికితే ములుకు                                                                               ఇటు పాడితే భడవ
ముళ్ళ పొదలకు నీరు                                                                                 పాటలన్నీ మూగి
జల్లువారెవరో ...                                                                                          మాటలైనాయి

                                                       అటు ఇటు మిళిత మై
                                                       ఒకటిగా మారితే
                                                       ఆనందముగ మనుషు
                                                       లందరుంటారు

__________________________________________________________________________________

Tuesday, 10 May 2011

ఆశ -
ఆశ పుట్టింది
చిగురు పెట్టింది
పూలు పూసింది
పిందేలేసింది

పండు పండే రోజులొస్తాయి
హాయి గుండె రోజులొస్తాయి

ఆశతో నా దిగులు
మాసి పోయింది
ఆశ తో నాక మా
వాశ్య పోయింది

ఆశ పండే రోజులొస్తాయి
హాయిగుండే రోజులొస్తాయి
__________________________________________________________________________________

నా హృదయం

గబా గబా జీవిత కాలం
గడచు చున్నది
జీవిత కర్తవ్యమేదో
తోచకున్నది

ఊహలంతు లేకుండా
ఊరుతున్నాయి
అది కావా లిదికావా
లంటున్నయ్యి

గందరగోళంగా ఉన్నవి నా
యందలి భావాలు
అందులోన మంచి చెడ్డ
ముందు యేరాలి.




మేఘం

ఎవరో !
తరుముకొస్తున్నట్లు
పరుగెత్తుతుంది

వెనకాల -
తళుకు తళుకున కత్తి
తెగ మెరుస్తుంది .

భోరున భోరున తాను
బొబ్బ పెడుతుంది
ఆకాశ మంతా
గగ్గోలు పెడుతుంది

బోట బోట మని కన్నీటి
బోట్లోదులుతుంది
తనకున్న బాధేంటో
తెలుపలేకుంది .
అల్లర్లు -



ఎందుకీ గోలుమాలు,మన
మందరం సోదరులం
ఎవరో పెట్టిందీ భేదం
నీరు పోసేది స్వలాభం
మానిపోతేనే ఈ రోగం
మనకందరికీ సౌభాగ్యం 11 ఎందుకీ 11

అగ్గిపుల్ల కొట్టిన దొర
బగ్గీలో పారిపోయే
సిగ్గుపడ్డ ఘోష స్త్రీ
చిక్కిందా మంటలోన 11 ఎందుకీ 11

దోచుకు పోయిన దొంగలు
దొరల్లాగ తిరుగుతారు
కాపలావాడు దొరికే
కానిస్టేబులు దెబ్బకు 11 ఎందుకీ 11

అమాయకుల ధన నష్టం
మన సరఫరాలకు కష్టం
ప్రయోజనం లేనిది స్పష్టం
ఎందుకీ పని ముదరష్టం 11 ఎందుకీ 11

మనమందరం భారతీయులం
అందరిధర్మం హిందూ ధర్మం
శాంతి అహింసలు మూల మర్మం
కలసి మెలసి ఉందాం !ఉందాం ! 11 ఎందుకీ 11

మన తాతలనాటిది సహనం
మనమేక్కింది శాంతి వాహనం
ఈ ద్వేషాలవ్వాలి నాశనం
కలసి మెలసి ఉండటం శాసనం 11 ఎందుకీ 11