పోయిన నా వాచీ ని తలచుకొని
'వాచీ' బాగు చేయు వారి చుట్టూ
తిరగ
లేని వాని కేందుకోయి మోజు
వాచీ పెట్టుకోకు వదులుకో ఆశలు
దినకరుండే నీకు దిక్కు 'సూరి '
చదువలేదు మరల శాస్త్రాలు బడిలోన
తరము గాదు నేర్వ తన్ని నాను
లోన మర్మ మేరుగాలేని వాచీ పైన
ఎందు కాశ పల్లకుండు 'సూరి '
పెద్ద పెద్ద వాళ్ళు పెట్టారు ఫేక్టరీల్
బుద్ధి లేని వారి బుర్ర కొట్టి
వద్దు వాచీ ,తెచ్చుకో బుద్ధి ఇకనైన
మిల్లు వీధి కెళ్ల వద్దు 'సూరి'
నాది నాది అనేడి ఆశ ను విడనాడి
రాని దాని తలపు మాన వోయి
పోయి నట్టి వాచీ పోలేదను కుంటూ
హాయి గా ఉండవోయి 'సూరి'!







