 |
కీ11 శే11 పులిపాక సూర్య ప్రకాశ రావు గారు
|
ముందు మాట :
కీ.శే. పులిపాక సూర్యప్రకాశ రావు గారు నా తండ్రి గారు. మా స్వస్థలం గుంటూరు లోని మన్నవ గ్రామం. వీరి జననం 1914 లో ఒక పేద కుటుంబంలోను, కాలేజి విద్యాభ్యాసం గుంటూరులోను, విజయనగరం లో జరిపారు. కాశి లో1939లొ న్యాయ శాస్త్రం లో హిందూ విశ్వవిద్యాలయం లో డిగ్రీ పొందారు . తదుపరి జయపూర్ (ఒరిస్సా ) వచ్చి న్యాయ వాదిగా స్థిరపడిపోయారు . ఆది వాసులకు తదితర నిరు పేదలకు జరిగే అన్యాయాలను తన వ్రుత్తి ధర్మంగా ఎదిరించే వారు . అదే విషయ వస్తువు తో కొన్ని రచనలు కూడా చేసారు.
హై స్కూల్ విద్యార్ధి గానే కవితలు వ్రాయడం ప్రారంభించారు .ఈ' కాసులపేరు' లోని కొన్ని పాటలు వారు 1930-1960 మధ్య కాలం లో వ్రాసినవి . ఇవి కాక గురజాడ శతజయంతి కానుకగా ముత్యాలసరాలు పేరుతొ పద్యాలూ హోమియో పతి వైద్యం లో వారి అనుభవాలు ఆధ్యాత్మిక ప్రసంగాలు , భజన పాటలు ,నవలలు , వ్యాసాలు కధలు అనేకం వ్రాసారు.
అనారోగ్య కారణంగా 1967 లో వృత్తి కి స్వస్తి చెప్పి ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటూ 1985 లో కన్ను మూసారు.
ఈ కాసులపేరు ను నా బ్లాగ్ లో ప్రచురించి అందరికి ఈ పాటలు వినిపించాలన్నది నా మొదటి ప్రయత్నం
No comments:
Post a Comment