Tuesday, 10 May 2011

స్వేఛ్చ

తోటనిండా పూలున్నై
వాసనలు వేదజల్లుతున్నై
మేడనిండా లైటులున్నై
కాంతులు ప్రసరించుతున్నై

సోదరా !నీకెన్ని ఉన్నా
స్వేఛ్చ లేదోయి !

గుమ్మములో మోటారులున్నై
కూర్చోటానికి సీటులున్నై
పెట్టెనిండా నోటులున్నై
పట్టుకోను చేతులున్నై

సోదరా !నీకెన్ని ఉన్నా
స్వేఛ్చ లేదోయి !

బుర్ర నిండా తలపులున్నై
నోటినిండా మాటలున్నై

సోదరా !నీకెన్ని ఉన్నా
స్వేఛ్చ లేదోయి !

స్వేఛ్చ లోనే జీవాముందోయి
స్వేఛ్చ లోనే భావాముందోయి

స్వేఛ్చ కోసం దేహమైన
ధారపోయలోయి !

No comments:

Post a Comment