Monday, 9 May 2011

నీవులేకుంటే

నీవులేకుంటే బ్రతుకు
విసుగనిపిస్తుంది
ఈ బాదర బంధాలన్నీ తొలగి
పోవాలనిపిస్తుంది

దిగులేస్తుంది -కడుపులోన
గుబగుబ మంటుంది
తలమీదేవరో
దబ దబ మని కొట్టినట్లుంటుంది
మనసంతా నీ వైపే
పరుగెత్తు తుంది

గడచి పోయే బ్రతుకు
జ్ఞాపకానికి వస్తుంది
గడియారం వైపు చూస్తె
ఎన్నాళ్ళింకా ఎడబాటు0దొ
ఏడుపోస్తూ ఉంది

మనసక్కడి కోస్తానంటుంది
ఈ తనువిక్కడ ఉండాల్సి ఉంది

No comments:

Post a Comment