పల్లెటూరు
పల్లెటూరి జీవనమే
బలే హాయి రా
తెల్ల వారంగానే
పుల్ల నీళ్ళ బువ్వ త్రాగి
పుల్లలకంమేళ్ళ మంటే
పెళ్ల బుట్ట నెత్తి నెట్టి
పోలములలో తిరుగుతుండే 11పల్లె11
ఎర్రని ఎండ లోన
బర్రెల మళ్ళేసు కుంటు
"అర్రే !దున్న కదల "దనే
కుర్ర వాని నడిగి చూడు 11 పల్లె 11
తోలి జాము కాడ లేచి
తోటలోని మళ్ళకంతా
తోడి నీరు పోయు చుండే
తోట మాలినడిగి చూడు 11 పల్లె 11
గొంగడి భుజాన కప్పి
కొంకి కర్ర చేత బట్టి
గొర్రె మంద లల్ల కాసే
గొల్ల వాని నడిగి చూడు 11 పల్లె 11
పచ్చని చేను గుండ
వచ్చేటి పైరు గాలి లో
నిశ్చింత గ కూర్చుండే
స్వేచ్చా జీవనమే రా 11 పల్లె 11
వంటరిగ రాతిరెల్ల
పంట కాలువలు పారు
తుంటయో నిలుచుంటయో
వెంట వెంట తిరిగి చూడు 11 పల్లె 11
ప్రొద్దు కూకిం దాక
పొలముల లో పని చేసి
గడ్డి మోపెత్తు కుని
గొడ్లను మళ్ళేసు కుంటూ 11 పల్లె 11
చల్ల గాలి వీస్తుంటే
మెల్ల గాను ఇల్లు చేరి
వేడన్నం గోంగూర
వెన్న పూస కలుపుకొని
జున్ను పాలు పోసు కుని
"జుర్రు జుర్రు జుర్రు " మనే 11 పల్లె 11
పండు వెన్నెల లోన
పాతర పై పక్కేసి
పండుకుంటేనే ,బ్ర
హ్మండమేల్ల మరుపౌను 11 పల్లె 11

No comments:
Post a Comment