కర్తవ్యం
ఎదోరీతిని నా
కాధారము కల్పిస్తావని
సోమరినై కూర్చొని , నిను
స్మరణ చేయుటో!
పరుల నోరు కొట్టి ,సొమ్ము
పోగు చేసి దాచిపెట్టి
కొండలన్నీ కొట్టుకొచ్చి
గోపురాలు కట్టు టో !
మేడలలో నుంటూ
మూడు పూటలు తింటూ
హయిగాను సంపదలను
అనుభవించు టో !
జీవిత కర్తవ్యమేదో తోచకున్నది
గబగబ జీవిత కాలం గడచుచున్నది
No comments:
Post a Comment