Sunday, 8 May 2011

కోరిక




వొద్దురా! నా కొద్దురా !
పేరోద్దురా ! ప్రతిభోద్దురా !
ఉన్న నాలుగు రోజులుండి
తిన్నగా పోతానురా

చెట్టు మీదా పుట్ట మీద
పూవు మీద , పిందె మీద
ఆకు మీద వాలు సీతా
కోక వలె నుంటానురా

ఎవరినో? నే నిచటికొచ్చిన
దేలకో ? నా కేలరా ?
వచ్చినందుకు కాలమేళ్ళ
బుచ్చి నే పోతానురా

No comments:

Post a Comment