Sunday, 8 May 2011

భావలత

మంచి మాటను మరిచి పోకుము
కొంచేమాలోచించి చేయుము
మంచి వాడీ కుర్రవా డని
పించుకోవాలోయ్ ! తమ్ముడు !

పూర్వమేపుడో ! వీరులేవరో !
పుట్టి లోక ప్రసిద్ధి గనిరని
చెప్పి మీసం తిప్పుకోటం
చిన్న తనమోయ్ !తమ్ముడు !

పారుతున్నది వేడి రక్తం !
వీరుడవు నీవ్! దీరు డవు నీవ్ !
నీతికొసం! జాతికోసం !
నిలబడాలోయ్! తమ్ముడు!


No comments:

Post a Comment