Monday, 9 May 2011

లోకంలో సంగతి






ఈ లోకంలో సంగతేంటో
నాకు తెలుస్తున్నది

పూవులు పూసింది మొక్క
పిందేలేసింది
కాయలు కాసి నేల
రాలి పోయింది

గాలి వానకొక మాను
కూలి పోయింది
మరునాడే చిగురోకటి
మొలక పెట్టింది

నిన్న పూసిన పువ్వులన్నీ
నేల రాలాయి
మొగ్గలన్ని వాటి మాటే
మరచి పోయాయి


No comments:

Post a Comment