నీకు జోహారు
ఎ వూరు? ఎ జాతి ? ఎప్పు డో
చ్చావిటకు
ఎందుకీ మిట మిటలు బాబు
నోరులేని కొండ కోయ
జాతుల 'ముండో'
కొట్టి బ్రతుకు బాబు
ఈ మేడ లీ కారు లెవరు
కొని పెట్టారు బాబు
ఏ కృషి కి ఫలితమిది బాబు
బీద రైతుల కాయ కష్టమును
దోచుకొని
ధన మార్జనము చేయు బాబు
నీ తండ్రి, నీ తాత నీదు ముత్తాతలు
దోపిడీ దారులోయ్ బాబు
ఇనుప పెట్టెలలోన ధనముంచు
కొని ఉన్న
దొంగ మూకలు దొడ్డ బాబు
కోర్టు కచ్చేరీలు నీ కోసమే నీవు
నిర్మించు కున్నావు బాబు
ధనము లేని వాడు దగరకు పోలేడు
నీకు జోహారులోయి బాబు!
P.S.'ముండో' -ఒరియా భాష లో 'తల'

No comments:
Post a Comment