ఏమిటిది -?
చచ్చిన వాడికి గౌరవమెంతో
ఇచ్చి ఊరేగించు తారు
బ్రతికున్న వారి స్తితి గతులేంటో
బొత్తిగా విచారించ కున్నారు
కూడు గుడ్డ లేక మనుషులు
మాడి పోతున్నారు
రాయి, సున్నం కొనుకొచ్చి
మేడలు కట్టిస్తున్నారు
చదువు సంధ్య లేక పిల్లలు
చెడిపోతున్నారు
బదులు పెట్టి సంఘం ఎందుకు
బాగు చేయకున్నారు
No comments:
Post a Comment