Saturday, 7 May 2011

ఆసుపత్రి


ఆసుపత్రి మంచం లో
ఆనుకుని పడుకున్నా-
అంతా బాగానే ఉందీ లోకంలో

సూర్యు డుదయించాడు
చుట్టూ తిరిగొస్తాడు
చందా మామను చూచి
చటుకున దాగుంటాడు

మోటారు లేళ్ళు తాయి
మేఘాలు కమ్మినాయి
కాఫీ హోటల్ లోన
గ్రామ ఫోను పాడుతుంది

ఆనందం గా ప్రజలు
అటూ ఇటూ తిరుగుతారు
కష్టా లేంటో వారికి
జ్ఞాపకమే రావు -
నేనున్నా! లేకున్నా !
తానేమీ ఆగకుండా
పరిగేట్ట్టే ప్రపంచం లో
నే పుట్టనేల

No comments:

Post a Comment